అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, మునగపాక ఎస్సై పి. ప్రసాద రావు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులతో కలిసి గణపర్తి గ్రామ పరిధిలో శారదా నది గట్టులో ఏర్పడిన చీలిక వద్ద అత్యవసర రక్షణ చర్యలు చేపట్టారు. సుమారు 600 ఇసుక బస్తాలు నింపి, గట్టును బలపరిచే పనులు వేగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పరవాడ డీఎస్పీ వి. విష్ణు స్వరూప్, ఎలమంచిలి సీఐ ఎస్. ధనంజయరావు పర్యవేక్షణలో ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది, స్థానిక గ్రామస్తుల సహకారంతో నిరంతరంగా కొనసాగింది.