అనకాపల్లి: బాలికల వసతిగృహాన్ని ఆకస్మిక తనిఖీ

4చూసినవారు
అనకాపల్లి: బాలికల వసతిగృహాన్ని ఆకస్మిక తనిఖీ
అనకాపల్లిలోని గుండాల జంక్షన్‌లో ఉన్న కళాశాల బాలికల వసతిగృహాన్ని ఆదివారం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆకస్మికంగా సందర్శించారు. వసతిగృహంలోని పరిస్థితులను పరిశీలించి బాలికలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాలికలు అధిక సంఖ్యలో ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి, మెరుగైన వసతుల కోసం అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు తిరిగి వసతిగృహానికి వచ్చే నాటికి సౌకర్యాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. బాత్రూంలు, గదుల శుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :