ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో యుద్ధ వ్యతిరేక ర్యాలీ జరిగింది. ఈ దాడులు ప్రపంచ శాంతికి, భారత్ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెస్తాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.