దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 జాతీయ బడ్జెట్‌ను రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డా. సి. ఎం రమేష్ హర్షాతిరేకంగా అభినందించారు. ఈ బడ్జెట్‌లో రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని కొనసాగించేలా తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమని అన్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించడం దేశ నారీశక్తికి గర్వకారణమని ఆయన తెలిపారు.