అనకాపల్లి జిల్లాలో ‘పల్లె పండుగ–2’ కింద చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను మే 15వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడకూడదని, ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ జగదీష్ తో పాటు పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.