అనకాపల్లి;మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచాలి.

18చూసినవారు
అనకాపల్లి;మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచాలి.
యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ. కృష్ణకుమారి, మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మంగళవారం అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవలో వేట చేస్తున్న గ్రామస్థులతో మాట్లాడుతూ, వస్త్ర సంచులను వాడాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని, పర్యావరణహిత జీవన విధానాన్ని అలవరచుకోవాలని, ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్