అనకాపల్లి: పోలీస్ ఆధ్వర్యంలోమహిళా సాధికారత వారోత్సవాలు

5చూసినవారు
అనకాపల్లి: పోలీస్ ఆధ్వర్యంలోమహిళా సాధికారత వారోత్సవాలు
మహిళా సాధికారత వారోత్సవాలను పురస్కరించుకుని, అనకాపల్లి జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. "మహిళలు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల నియంత్రణలో పోలీసుల పాత్ర" అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, వారి పట్ల గౌరవాన్ని పెంపొందించడం, సమాజంలో మహిళా రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను యువతకు వివరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్