అనకాపల్లి;పుస్తక పఠనంతోనే లోకజ్ఞానం లభిస్తుంది: స్పీకర్

6చూసినవారు
అనకాపల్లి;పుస్తక పఠనంతోనే లోకజ్ఞానం లభిస్తుంది: స్పీకర్
ఆధునిక జీవనశైలి, ముఖ్యంగా యువత పుస్తక పఠనానికి దూరమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం అనకాపల్లిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను సందర్శించిన ఆయన, 'బిజీ లైఫ్' అంటూ సమయం లేదంటున్నప్పటికీ, నిజానికి పెద్దగా పనేమీ ఉండదని చమత్కరించారు. కుటుంబ సభ్యులతో, పిల్లలతో మాట్లాడటానికి కూడా సమయం దొరకడం లేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్