అన‌కాప‌ల్లి: బీజేపీని మరింత బలోపేతం చేయాలి

2చూసినవారు
అన‌కాప‌ల్లి: బీజేపీని మరింత బలోపేతం చేయాలి
అనకాపల్లి పట్టణంలోని చదువుల వారివీధి బిజెపి కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తల పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎం. వి. ఆర్, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, మండల స్థాయిలో నిర్వహించే సమావేశాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు ఎం. వి. ఆర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎం. వి. ఆర్ యువసేన సభ్యులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్