అట్టహాసంగా ప్రారంభమైన 'అనకాపల్లి ఉత్సవ్'

0చూసినవారు
అట్టహాసంగా ప్రారంభమైన 'అనకాపల్లి ఉత్సవ్'
అనకాపల్లి జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘అనకాపల్లి ఉత్సవ్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. అచ్యుతాపురం మండలం, కొండకర్ల ఆవ తీరాన జరిగిన ఈ వేడుకలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన పర్యాటకుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించి, స్వయంగా బోటులో ప్రయాణించి ప్రకృతి అందాలను తిలకించారు. అనంతరం ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్