అనకాపల్లి వాసవి కన్యకా పరమేశ్వరికి స్వర్ణ శ్రీ చక్రం

0చూసినవారు
అనకాపల్లి వాసవి కన్యకా పరమేశ్వరికి స్వర్ణ శ్రీ చక్రం
అనకాపల్లిలోని వందేళ్ల చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మంగళవారం దివంగత కందుల లక్ష్మి సూర్యం గుప్త జ్ఞాపకార్థం, వారి కుటుంబ సభ్యులు రూ. 1.50 లక్షల విలువైన 9 గ్రాముల బంగారు శ్రీ చక్రం లాకెట్‌ను అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఈ లాకెట్‌ను ఆలయ కమిటీ సభ్యులకు కడిమిశెట్టి లక్ష్మీ చిదంబరం (నవీన్) మరియు నాగ మాధురి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వుప్పల రవిరామ్ జవహర్, కార్యదర్శి సోమరాజు, కోశాధికారి అచ్యుతరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి వివిఎస్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్