అన్నవరం గిరి ప్రదర్శనకు వెళ్తూ ఆటో బోల్తా: 10 మందికి గాయాలు

3చూసినవారు
అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని పార్వతీపురం గ్రామం నుండి బుధవారం అన్నవరంలో జరుగు గిరి ప్రదర్శనకు పదిమంది ఆటోలో బయలుదేరారు. తేటగుంట సమీపంలో కుక్కను తప్పించబోయి ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రయాణికులు గాయపడ్డారు. హైవేలోని 108 వాహనంలో వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ రాజాన వీర సూర్యచంద్ర, నాతవరం జనసేన మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణతో కలిసి తుని ఏరియా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్