ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరావు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సంబరాలు జరిగాయి. పార్టీ కార్యాలయంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, బాణాసంచి కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ, 2028 నాటికి అమరావతిని 'సెల్ఫ్ సస్టైన్' రాజధానిగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వ కుట్రల వల్ల రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఏపీకి, నేడు గెజిట్ విడుదలతో అంతర్జాతీయ గుర్తింపు లభించిందని తెలిపారు.