విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరగనున్న సిఐటియు అఖిలభారత మహాసభల గోడపత్రికను సిఐటియు జిల్లా కార్యదర్శి జి దేవుడు నాయుడు రాంబిల్లిలో సోమవారం ఆవిష్కరించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ మహాసభలు, సిఐటియు ఏర్పడిన 55 ఏళ్ల చరిత్రలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ మహాసభలు విశాఖపట్నంలో జరగడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.