భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, లేబర్ కోడ్ల రద్దుకు సిఐటియు డిమాండ్

6చూసినవారు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, లేబర్ కోడ్ల రద్దుకు సిఐటియు డిమాండ్
సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోము నాయుడు సోమవారం అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం తిమ్మరాజుపేట, దోసూరు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ముఠా సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్