
దేశంలోనే తొలిసారి ఏపీలో 'పీఎం-సేతు' పథకం అమలు
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో 'పీఎం-సేతు' పథకం అమలు కానుంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ రాష్ట్రానికి ఈ అవకాశం కల్పించింది. విశాఖ ఐటీఐ క్లస్టర్‌కు సంబంధించిన 'స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్'కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆర్సెల్లార్ మిత్తల్ భాగస్వామ్యంతో విశాఖ ఐటీఐల ఆధునికీకరణ జరగనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీఐ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడం, కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. దీని కోసం రూ.60 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు.




