అనకాపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం

9చూసినవారు
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొండల అగ్రహారంలోని ఇమ్మానుయేల్ నర్సింగ్ కాలేజీలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ధృవీకరించారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను సురక్షితంగా వేరే హాస్టల్‌కు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :