వేటకు సిద్ధమైన మత్స్యకారులు

9చూసినవారు
వేటకు సిద్ధమైన మత్స్యకారులు
చేపల సంతానోత్పత్తి పరిరక్షణ కోసం ప్రభుత్వం విధించిన 61 రోజుల వేట నిషేధం ఆదివారం అర్థరాత్రితో ముగియనుంది. దీంతో అనకాపల్లి జిల్లాలోని ముత్యాలమ్మపాలెం, పూడిమడక, రేవుపోలవరం, రాజయ్యపేట వంటి తీర ప్రాంతాల మత్స్యకారులు సోమవారం నుంచి సముద్రంలో చేపల వేటను పునఃప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అమలులో ఉన్న ఈ నిషేధం ముగియడంతో మత్స్యకారుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :