
పుతిన్-అరాఘ్చీ భేటీ.. ఇరాన్‌కు రష్యా పూర్తి మద్దతు
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సోమవారం రష్యాలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరాన్‌కు రష్యా తన పూర్తి మద్దతును ప్రకటించింది. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి పుతిన్ స్వయంగా అరాఘ్చీని కలవడం, ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలమైన తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ శ్రేయస్సు కోసం రష్యా కృషి చేస్తుందని, వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తుందని పుతిన్ హామీ ఇచ్చారు.




