కోటవురట్లలో హోంమంత్రి అనిత పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

902చూసినవారు
కోటవురట్లలో హోంమంత్రి అనిత పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలో హోంమంత్రి అనిత మే 1న పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం రామచంద్రపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై, అనంతరం రాజుపేట గ్రామంలో బొడ్డేటి వెంకటరమణ కుమారుడి పెళ్లికి హాజరవుతారు. అనంతరం సుంకపూరు గ్రామంలో జరిగే గంగమ్మ తల్లి పండుగ సంబరాలకు హాజరై తల్లిని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమాలకు మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని మండల తెదేపా అధ్యక్షులు లింగం నాయుడు తెలిపారు. దీనికిగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్