అనకాపల్లి జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎంవీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు, కొల్లిమల్ల పెంటారావులు ఎంవీఆర్ స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, రోడ్‌సైడ్‌లో ఉన్న నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. ఆకలితో ఉన్నవారికి భోజనం అందించడం ద్వారా మానవత్వం చాటుకోవచ్చని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.