అంతర్జాతీయ స్థాయిలో నిస్వార్థ సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ అంతర్జాతీయ వాసవి క్లబ్ అని దాని అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తెలిపారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన జిల్లా సర్వ సభ్య సమావేశంలో (డిస్కాన్) ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది 52 పథకాల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అన్ని రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని సత్కరించామని పేర్కొన్నారు. జిల్లా గవర్నర్ కే పూర్ణిమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు.