అనకాపల్లి జిల్లాలో జాబ్ మేళా క్యాలెండర్ విడుదల

760చూసినవారు
అనకాపల్లి జిల్లాలో జాబ్ మేళా క్యాలెండర్ విడుదల
అనకాపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా క్యాలెండర్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. గతంలో నిర్వహించిన మేళాల్లో రాష్ట్రంలోనే అత్యధిక నియామకాలు జిల్లాలో జరిగినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మరింత విస్తృతంగా మేళాలు నిర్వహించనున్నట్లు పేర్కొంటూ, వివిధ మండల కేంద్రాల్లో నిర్ణీత తేదీలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రముఖ కంపెనీలు పాల్గొని పలు రంగాల్లో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. అర్హత గల అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు వంటి పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్