ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


మొబైల్ పాస్‌వర్డ్ అడిగిందని భార్యను హత్య చేసిన భర్త
Apr 09, 2026, 10:04 IST/

మొబైల్ పాస్‌వర్డ్ అడిగిందని భార్యను హత్య చేసిన భర్త

Apr 09, 2026, 10:04 IST
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన నెలకొంది. రేవా జిల్లాలో మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్ విషయంలో తలెత్తిన వివాదంలో భర్త దీపక్ మిశ్రా తన భార్య శిఖా మిశ్రాను కత్తితో పొడిచి చంపేశాడు. భార్య ఫోన్ పాస్‌వర్డ్ చెప్పడానికి నిరాకరించడంతో పాటు, భర్త ఫోన్ పాస్‌వర్డ్ అడగడం దీపక్‌కు కోపం తెప్పించింది. ఆగ్రహంతో ఊగిపోయిన దీపక్, ఇంట్లోని కత్తితో భార్యపై దాడి చేశాడు. తన ముగ్గురు పిల్లల కళ్ల ముందే జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శిఖా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడు దీపక్ మిశ్రా పరారయ్యాడు, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.