'అనకాపల్లి: చలో ఆకివీడు'ను విజయవంతం చేయండి: బిఎస్పీ

5చూసినవారు
'అనకాపల్లి: చలో ఆకివీడు'ను విజయవంతం చేయండి: బిఎస్పీ
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా, ఆకివీడులో గొంతెనమ్మ ఆలయ నిర్మాణం కోరుతూ ఈ నెల 3న నిర్వహించనున్న 'చలో ఆకివీడు' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనకాపల్లి బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ సూదికొండ మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ పిలుపు మేరకు జరిగే ఈ నిరసనకు దళిత, బహుజన సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు నూకరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్