
బైక్ అదుపుతప్పి బోల్తాపడి ముగ్గురు కూలీలు స్పాట్ డెడ్
TG: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గాంధారి మండలంలో రాంపూర్ గడ్డ వద్ద కల్వర్టు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం గాంధారి వైపు వస్తుండగా జరిగింది. మృతులు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖియా (21), రాహుల్ (21), జావీద్ (22)గా గుర్తించారు. వీరు రాంపూర్ గడ్డ వద్ద రైస్‌మిల్లులో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




