జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంతో పాటు అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో సోమవారం (మార్చి 30) ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి. జి. ఆర్. ఎస్) మరియు రెవిన్యూ క్లినిక్ నిర్వహించనున్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు. నేరుగా హాజరు కాలేని వారు meekosam. ap. gov. in వెబ్‌సైట్ ద్వారా తమ అర్జీలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.