
నేటి నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అమలు
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20 ఇంధనం)ను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, వాహనాల కాలుష్యాన్ని నియంత్రించడం దీని లక్ష్యం. అయితే ఇంధన సామర్థ్యం, ఇంజిన్ పనితీరుపై ప్రభావం, పాత వాహనాలకు నష్టం వంటి ఆందోళనలు వినియోగదారులలో ఉన్నాయి. పారిశ్రామిక సంస్థలు E20 సురక్షితమని చెబుతున్నప్పటికీ, పర్యావరణవేత్తలు నైట్రోజన్ ఆక్సైడ్లు, అసిటాల్డిహైడ్ల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




