
సెప్టెంబర్ నుంచి ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ నిలిపివేత
సెప్టెంబర్ 8వ తేదీ నుండి ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే పాత వెర్షన్‌లలో వాట్సప్ పనిచేయదని వాబీటా ఇన్ఫో నివేదించింది. ఈ తేదీ నుండి ఆండ్రాయిడ్ 6.0 లేదా ఆపై వెర్షన్‌లలో మాత్రమే వాట్సప్ అందుబాటులో ఉంటుంది. పాతతరం స్మార్ట్‌ఫోన్లకు కొత్త ఫీచర్లను అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభావితమయ్యే వినియోగదారులకు ఇప్పటికే నోటిఫికేషన్లు పంపుతూ, చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకోవాలని సూచిస్తోంది. ఈ మార్పు వాట్సప్ మెసెంజర్, వాట్సప్ బిజినెస్ రెండింటికీ వర్తిస్తుంది. ఐఓఎస్ 15.1 లేదా ఆపై వెర్షన్‌లలో వాట్సప్ యథావిధిగా పనిచేస్తుంది.




