అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ వేదికలలో సమర్పించిన అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు అర్జీదారులు టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయాలని సూచించారు. హాజరు కాలేని వారు 'మీ కోసం' పోర్టల్ ద్వారా కూడా తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.