చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ 8వ పోషణ్ పక్వాడా పక్షోత్సవాల్లో భాగస్వాములు కావాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో ఈ వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో శిశువు మెదడు అభివృద్ధి, సరైన పోషకాహారంపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా శిశువు పెంపకంలో తండ్రుల పాత్రను పెంచేలా ఈసారి ప్రత్యేక పోటీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సూర్య లక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు.