అనకాపల్లి గౌరీ పరమేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్న స్పీకర్

1చూసినవారు
అనకాపల్లి గౌరీ పరమేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్న స్పీకర్
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం అనకాపల్లిలోని శ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సమర్పించే పవిత్ర సారెను స్వయంగా మోసి, ఆలయంలోకి తీసుకువెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్