అనకాపల్లికి మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీ సీఎం రమేష్ బుధవారం అచ్చయ్యపేట సమీపంలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఆ స్థలం అనువుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థల పరిశీలన అనంతరం అధికారులతో మాట్లాడిన ఎంపీ, భవన నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక వసతులు, భూమి పరమైన సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.