అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం పాతతంగేడు గ్రామంలో "స్వచ్ఛపథం" అనే కొత్త కార్యక్రమాన్ని ఎంపీడీఓ చంద్రశేఖర్ బుధవారం ప్రారంభించారు. రహదారుల పక్కన చెత్త తొలగించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం దీనిని నిర్వహిస్తారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవంలో ఎంపీడీఓతో పాటు డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.