అనకాపల్లి జిల్లాను డ్రగ్స్, గంజాయి రహితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులకు ఆదేశించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచి యువతను చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచాలని సూచించారు. జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖలు కలిసికట్టుగా పనిచేసి గంజాయి సరఫరా, రవాణాను అరికట్టాలని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులను చైతన్యపరచాలని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు కట్టుదిట్టం చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు.