స్వాతంత్ర సమరయోధుడు, వడ్డే ఓబన్నకి ఘన నివాళులు

13చూసినవారు
స్వాతంత్ర సమరయోధుడు, వడ్డే ఓబన్నకి ఘన నివాళులు
స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 10వ వర్ధంతిని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, కశింకోట ఇన్స్పెక్టర్ స్వామినాయుడు, కమాండ్ కంట్రోల్ ఎస్సై సురేంద్ర కుమార్ లు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన గౌరవార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకునే ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్