రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి. ఎం రమేష్, అనకాపల్లి జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కొండకర్ల ఆవలో జరుగుతున్న అనకాపల్లి ఉత్సవాలు జిల్లా పర్యాటక సామర్థ్యాన్ని రాష్ట్రానికి, దేశానికి పరిచయం చేసే అవకాశమని, కొండకర్ల ఆవను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.