అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళా సాధికారత, ఆరోగ్యం, సామాజిక బాధ్యతపై మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు ప్రజల భాగస్వామ్యంతో రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, అవగాహన సదస్సులు విజయవంతంగా జరిగాయి. అనకాపల్లి, నర్సీపట్నం, నక్కపల్లి, ఎలమంచిలి, అచ్చుతాపురం, కోటవురట్ల తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.