అనకాపల్లి విజయ రెసిడెన్సి లో శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. సర్వేజనా ఐక్యవేదిక అధ్యక్షులు కోరిబిల్లి పర్రి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు, ఐక్యవేదిక ప్రతినిధులు స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర పాల్గొని రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలు అందర్నీ అభినందించి సత్కరించారు.