Apr 12, 2026, 18:04 IST/సికింద్రాబాద్
సికింద్రాబాద్
వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Apr 12, 2026, 18:04 IST
సికింద్రాబాద్ వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కొయ్యడ కళ్యాణి బేగం పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మారేడుపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె ఆత్మహత్యపై వారసిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.