విశాఖపట్నం జిల్లా, ఆనంతగిరి మండలం, జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మలేరియాతో బాధపడుతున్నారు. ముగ్గురు బాలికలకు దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించి, రాత్రి 9:30 గంటలకు 108 వాహనంలో కె. కోటపాడు 50 పడకల ఆసుపత్రికి తరలించారు. గిరిజన బాలికల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం డిమాండ్ చేసింది.