ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొన్నారు. అరకు వ్యాలీ మండలంలోని కొత్త బల్లుగూడ, సూకూరుగూడ, కొర్రగూడ గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమని విమర్శించారు. ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.