బస్ షెల్టర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

5చూసినవారు
డుంబ్రిగుడ మండలం కండ్రుం జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా నుంచి బైక్‌పై వస్తున్న కొసొంగుడ గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. వాహనం అదుపుతప్పి బస్ షెల్టర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :