
గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, అక్కడ చిక్కుకున్న ప్రవాస భారతీయుల కోసం కేంద్ర విదేశాంగ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. సహాయం కోరేవారు 1800118797, 011 2301 2113/4104/7905 నంబర్లలో సంప్రదించవచ్చు.




