అరకులో తుఫాను ప్రభావంతో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఎన్.ఆర్.పురం పంచాయతీ, కొండపర్తి వెళ్లే రోడ్లు కనిపించకుండా పోయాయి. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా పడుతున్నాయి. వైకుంఠగిరి దర్శనానికి వెళ్లే భక్తులు రోడ్డు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు.