
57 ఏళ్ల బంధం.. ఒపెక్ కూటమి నుంచి తప్పుకున్న యూఏఈ
యూఏఈ కీలక ప్రకటన చేసింది. 57 ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC) కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ఒపెక్, ఒపెక్ ప్లస్ నుంచి యూఏఈ తప్పుకోనుంది. యూఏఈ నిర్ణయంతో సౌదీకి భారీ దెబ్బ తగలనుంది. కాగా, కూటమిలో మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా యూఏఈ ఉంది. భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ఉత్పత్తి కోటాలపై తలెత్తిన అంతర్గత విబేధాలే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.




