హుకుంపేట మండలం గత్తుం పంచాయతీ గత్తుం గ్రామంలో ఆదివారం గిరిజన రైతులకు కొడవళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కోతల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన పనిముట్లు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏరువాక కేంద్రం పాడేరు సైంటిస్ట్ డా. ప్రదీప్ కుమార్ భూసార పరీక్షలు, సేంద్రియ వ్యవసాయం, బయో ఫర్టిలైజర్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. వనవాసి కృషి మిత్ర (FPO) ఆధ్వర్యంలో 20 పేద కుటుంబాలకు కొడవళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.