గంజాయి జోలికి పోవద్దు: ఎస్సై సురేష్ కుమార్

4చూసినవారు
జిల్లా ఆదేశాల మేరకు, స్థానిక ఎస్సై ఎల్. సురేష్ కుమార్ శనివారం గసభ పంచాయతీ కేంద్రం, గొందిగూడ గ్రామాల్లో గ్రామస్తులు, యువత, మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, చదువుకున్న గిరిజన యువత గంజాయి జోలికి పోవద్దని, గంజాయి రవాణాకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మహిళలు, బాలికల వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :