వేదురుగొయ్యిలో తాగునీటి కష్టాలు

1చూసినవారు
వేదురుగొయ్యిలో తాగునీటి కష్టాలు
పెదబయలు మండలంలోని బొంగరం పంచాయతీ వేదురుగొయ్యి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. సుమారు 45 కుటుంబాలు, 250 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి పైప్‌లైన్ ద్వారా మంచినీటి సరఫరా లేకపోవడంతో, గ్రామస్థులు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మహిళలు, వృద్ధులు, గర్భిణీలు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో రహదారి సౌకర్యం సరిగా లేకపోవడం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్