అరకులోయలో "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.